
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైద్యులు మాణిక్యాలరావుకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఆయన పల్స్‌రేట్, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష కారణంగా కొంత నీరసంగా ఉన్నా.. యోగాసనాలు వేస్తూ.. ధ్యానం చేస్తూ మాణిక్యాలరావు ఉల్లాసంగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment