paidikondala manikyala rao
-
మా జిల్లా ప్రజల్ని ఆదుకోండి: మాజీ మంత్రి
తాడేపల్లిగూడెం: గత తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిన ఈ జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడికొండల మాణికాల్య రావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ యువత వలసబాట పడుతున్నారని, వారిని కొత్త ప్రభుత్వం ఆదుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఆ దిశగా అడుగులు వేస్తూ బెల్ట్‌షాపుల రద్దుకు కృషి చేస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ జిల్లాలో పూర్తికాని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు అనుమతినిచ్చిన పాత, కొత్త ప్రభుత్వాలకు ధన్యవాదాలన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో బాటుగా విమానాశ్రయ భూముల్లో నివాస పట్టాలు పంపిణీ కొత్త ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
బొలిశెట్టి వర్సెస్ మాణిక్యాలరావు.. రసాభాస
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసతో అర్థాంతరంగా ముగిసింది. మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రసంగాన్ని కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడం గందరగోళానికి దారితీసింది. కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులు పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాణిక్యాలరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. దీంతో ఆయన కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారన్న సమాచారంతో.. మున్సిపల్ కార్యాలయం వద్ద ముందస్తుగా పోలీసులను మోహరించారు. -
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
-
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైద్యులు మాణిక్యాలరావుకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఆయన పల్స్రేట్, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష కారణంగా కొంత నీరసంగా ఉన్నా.. యోగాసనాలు వేస్తూ.. ధ్యానం చేస్తూ మాణిక్యాలరావు ఉల్లాసంగా గడిపారు. -
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు
-
కంభంపాటి హరిబాబు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల నడుమ హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి రాంమాధవ కీలక పాత్ర పోషించారని సమాచారం. -
మీకు సోము వీర్రాజే సరిపోతాడు...
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పైడికొండల మాణిక్యాలరావు పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి...అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ మాణిక్యాలరావును అభినందించారు. అయితే తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం లేదని, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవుతారని, ఆయన పేరు ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా నన్నపనేని మాట్లాడుతూ.. మీరే అధ్యక్షుడని అందరు అనుకుంటున్నారని అనగా, మీకు సోము వీర్రాజే సరిపోతాడంటూ మాణిక్యాలరావు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు మంత్రి కళా వెంకట్రావు కూడా మాణిక్యాలరావును చూసి..కొత్త శత్రువులకు నమస్కారం అంటూ నవ్వుతూ పలకరించారు. మోదీ మహిళలను బాధ పెడుతున్నారు.. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ..‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీలోని రెండున్నర కోట్ల మంది మహిళలను పెడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే మోదీకి నోటీసులు పంపుతాను. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బాగా బాధ పడుతున్నారు. మోదీ, బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ స్పీకర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని అవమానాలు భరించడం దేనికంటూ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాస్తాను.’ అని అన్నారు. -
పవన్ మీటింగుకు నేనూ జనాన్ని పంపా: మంత్రి
పవన్ కల్యాణ్ సమావేశానికి తాను కూడా జనాలను పంపానని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తన విజయానికి జనసేన కూడా ఒక కారణమని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజిని పవన్ కూడా స్వాగతించే రోజు వస్తుందని ఆయన తెలిపారు. పెట్టె తెరిస్తేనే అందులో ఉన్న లడ్డూలు మంచివా, పాచివా అనే విషయం తెలుస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. ప్యాకేజిలో ఏముందో తెలియకుండానే పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. ఇక రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చిన ఆలయాలను ముహూర్తాలు ఖరారు కాగానే పునర్నిర్మిస్తామని మాణిక్యాలరావు చెప్పారు. -
ప్రతిపక్ష నేతకు ఆ హక్కు ఉంది: మాణిక్యాలరావు
- వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పై షాకింగ్ కామెంట్ రావులపాలెం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులను కలవొచ్చని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డికి అవాంతరాలు కల్పించే అవకాశం లేదని, దీనిపై టీడీపీ నేతలు, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర మంత్రులను, అధికారులను కలిసే అర్హత వైఎస్ జగన్ కు లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని విలేకరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి, ఇతర మంత్రులను, అధికారులను కలవడం సాధారణ విషయమేనన్నారు. యనమల మంచి పార్లమెంటేరియన్ అని, పార్లమెంటరీ సంప్రదాయూలపై అవగాహన కలిగిన ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. వైఎస్ జగన్‌కు అర్హత లేదన్నప్పుడు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సమయంలో ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను ప్రభుత్వం ఎందుకు పంపిందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ఆ పార్టీ విజ్ఞతకు సంబంధించిన విషయమన్నారు. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వస్తున్నామనడం వారి విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే ఆలోచించి నిర్ణయం తీసుకొంటామన్నారు. బీజేపీ మద్దతు అవసరం లేకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొంటున్నారా అని ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేదని, మిత్రపక్షంగా మాత్రమే కలసి ఉన్నామని చెప్పారు. కేంద్రంలో మద్దతుకు, రాష్ట్రంలో మద్దతుకు సంబంధం లేదని మంత్రి అన్నారు. కృష్ణా పుష్కరాలకు రూ.150 కోట్లు ఈ ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలకు దేవాదాయ శాఖ ద్వారా రూ.150 కోట్లు కేటాయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ఈ నిధులతో సుమారు 500 దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేస్తామన్నారు. విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం
ఆదాయాలు లేని దేవాలయాల సిబ్బందికి ప్రతినెలా 5వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. జనవరి నుంచి 2,645 మంది ధార్మిక సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం రూ. 250 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామన్నారు. జనవరి 1న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మూడు రోజుల పాటు సిఫార్సు లేఖలను నిషేధించామని మాణిక్యాలరావు చెప్పారు. వీఐపీల లేఖలను అనుమతించేది లేదని, వీఐపీ సహా నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను కూడా 5వేల నుంచి 800కు తగ్గించినట్లు మంత్రి తెలిపారు. -
జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూలై 14 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు పుష్కరాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ పుష్కరాల కోసం మొత్తం 254 రేవులు నిర్మిస్తామని, గోదావరి పరిసరాల్లో 327 దేవాలయాలను ఆధునికీకరిస్తామని ఆయన వివరించారు. ఈ ఉత్సవాలకు మొత్తం 900 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని, అందులో 600 కోట్లు కేంద్రం నుంచి సాయంగా అందుతాయని తెలిపారు. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్-లలో గోదావరి తల్లికి మహాహారతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉండటం వల్లే టీటీడీ బోర్డు నియామక ప్రక్రియ ఆలస్యం అవుతోందని మాణిక్యాలరావు చెప్పారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసమేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదని ఆయన అన్నారు.