
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల నడుమ హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి రాంమాధవ కీలక పాత్ర పోషించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment