దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం | temple staff to be given honororium of 5000, says minister manikyala rao | Sakshi
Sakshi News home page

దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం

Published Sat, Dec 20 2014 6:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం

దేవాలయ సిబ్బందికి రూ. 5వేల గౌరవవేతనం

ఆదాయాలు లేని దేవాలయాల సిబ్బందికి ప్రతినెలా 5వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. జనవరి నుంచి 2,645 మంది ధార్మిక సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీని కోసం రూ. 250 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామన్నారు.

జనవరి 1న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మూడు రోజుల పాటు సిఫార్సు లేఖలను నిషేధించామని మాణిక్యాలరావు చెప్పారు. వీఐపీల లేఖలను అనుమతించేది లేదని, వీఐపీ సహా నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను కూడా 5వేల నుంచి 800కు తగ్గించినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement