
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసతో అర్థాంతరంగా ముగిసింది. మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రసంగాన్ని కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడం గందరగోళానికి దారితీసింది. కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులు పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే మాణిక్యాలరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. దీంతో ఆయన కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారన్న సమాచారంతో.. మున్సిపల్ కార్యాలయం వద్ద ముందస్తుగా పోలీసులను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment