పవన్ మీటింగుకు నేనూ జనాన్ని పంపా: మంత్రి | I too have sent people for pawan kalyan meeting, says ap minister | Sakshi
Sakshi News home page

పవన్ మీటింగుకు నేనూ జనాన్ని పంపా: మంత్రి

Published Sat, Sep 10 2016 6:10 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

పవన్ మీటింగుకు నేనూ జనాన్ని పంపా: మంత్రి - Sakshi

పవన్ మీటింగుకు నేనూ జనాన్ని పంపా: మంత్రి

పవన్ కల్యాణ్ సమావేశానికి తాను కూడా జనాలను పంపానని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తన విజయానికి జనసేన కూడా ఒక కారణమని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజిని పవన్ కూడా స్వాగతించే రోజు వస్తుందని ఆయన తెలిపారు. పెట్టె తెరిస్తేనే అందులో ఉన్న లడ్డూలు మంచివా, పాచివా అనే విషయం తెలుస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. ప్యాకేజిలో ఏముందో తెలియకుండానే పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. ఇక రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చిన ఆలయాలను ముహూర్తాలు ఖరారు కాగానే పునర్నిర్మిస్తామని మాణిక్యాలరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement