గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.