ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు | K Haribabu Resigns Resigns To AP BJP Chief Post | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు

Published Tue, Apr 17 2018 9:40 AM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా ఉద్వాసన తప్పదనే ఊహాగానాల నడుమ హరిబాబు రాజీనామాపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. కాగా, మరో వారం రోజుల్లో ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఆ పదవి అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి వైదొలగడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీలో పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా పరిశీలించిన అధిష్టానం చివరికి పైడికొండల వైపే మొగ్గిందని, ఈ నిర్ణయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి రాంమాధవ​ కీలక పాత్ర పోషించారని సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement