
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిన్న(సోమవారం) కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టగా.. దానికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ‘అధర్మంపై ధర్మం పోరు’.. అంటూ ఏప్రిల్ 12న ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎంపీలంతా ఈ గురువారం చేపట్టబోయే దీక్ష కోసం సిద్ధమవుతున్నారు. ఈ దీక్షలో మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సహా బీజేపీ ఎంపీలంతా పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. నిరాహార దీక్ష చేయాలనే ఆలోచన ప్రధానిదే. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షం వృథా చేసిందని ప్రజలకు తెలియజేయడానికే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే ఎంపీలు సైతం తమ జీతాన్ని త్యాగం చేశారు అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కారణంగానే అతి ముఖ్యమైన బిల్లులపై చర‍్చ జరగకుండా పోయిందని, వీరి వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి అందుతున్న ప్రజాధనం, సభా సమయం వృథా అయిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment