
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఈనెల 20న నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గంగదేవిపాడులో ఉద్యోగం రావట్లేదని ఆత్మహత్యకు పాల్పడిన నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని గురువారం వైఎస్సార్ టీపీ నేత లక్కినేని సుధీర్‌బాబు పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అదేరోజు నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబూరి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి విజయనరసింహారెడ్డి పాల్గొన్నారు.