Lok pal bill
-
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్‌లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్‌పై రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్‌కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసుకెళ్లారు. -
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్
ఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కొరకు ఎందకైనా వెళ్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిశారు. లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపై ఆయన చర్చించారు.అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దేశాన్ని అవినీతిరహితం చేయడానికి సీఎం పదవిని వందసార్లు త్యాగం చెయ్యొచ్చు’ అని అన్నారు. అవినీతిని రూపు మాపేందుకు తీసుకువచ్చిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే ఎన్నికలకు ముందు ఓటర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వారిగే గుర్తుండి పోతామని కేజ్రీవాల్ తెలిపారు. లోక్ పాల్ అంశాన్ని అసెంబ్లీలో కేవలం 27 సభ్యుల బలం మాత్రమే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి ఆరంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోలోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలని కాంగ్రెస్, బీజేపీ లు అభిప్రాయపడుతున్నాయి. -
అవినీతి నిర్మూలనకు నడుంబిగించాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం, అవినీతి నుంచి విముక్తి లభిస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతారని, ఇందుకు అందరూ కంకణబద్ధులు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ‘దేశంలో అవినీతి సమస్య-లోక్‌పాల్ బిల్లు-యువత పాత్ర’ అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ సంస్థలు ఎన్ని పనిచేస్తున్నా ఫలితం కనిపించటం లేదన్నారు. అందుకే ప్రభుత్వం ఇటీవల లోక్‌పాల్ బిల్లును తీసుకువచ్చిందని, దీనిద్వారా మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. పరిమితంగా ఉన్న వనరుల దుర్వినియోగంతో కాలుష్యం ఏర్పడి వ్యాధుల తీవ్రత పెరిగిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, యువకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. యాంటీ కరప్షన్ సిటిజన్ ఫోరం కన్వీనర్, హైకోర్టు న్యాయవాది వడ్లకొండ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లా 6వ అదనపు జడ్జి వెంకటక్రిష్ణయ్య, మంథని మెజిస్ట్రేట్ కుమారస్వామి పాల్గొన్నారు. -
లోక్‌పాల్ ఆమోదంతో అన్నా శిబిరంలో సంబరం