లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్ | aravind kejriwal meets Lt Governor Najeeb Jung | Sakshi
Sakshi News home page

లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్

Published Mon, Feb 10 2014 3:05 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

aravind kejriwal meets Lt Governor Najeeb Jung

ఢిల్లీ: జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కొరకు ఎందకైనా వెళ్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిశారు. లోక్పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపై ఆయన చర్చించారు.అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దేశాన్ని అవినీతిరహితం చేయడానికి సీఎం పదవిని వందసార్లు త్యాగం చెయ్యొచ్చు’ అని అన్నారు.

అవినీతిని రూపు మాపేందుకు తీసుకువచ్చిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే ఎన్నికలకు ముందు ఓటర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వారిగే గుర్తుండి పోతామని కేజ్రీవాల్ తెలిపారు. లోక్ పాల్ అంశాన్ని అసెంబ్లీలో కేవలం 27 సభ్యుల బలం మాత్రమే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి ఆరంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోలోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాలని కాంగ్రెస్, బీజేపీ లు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement