lok pal
-
ఆరో రోజుకు హజారే దీక్ష
రాలెగావ్ సిద్ధి (మహారాష్ట్ర): లోక్‌పాల్, లోకాయుక్తాల నియామకాలు చేపట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరింది. దీక్ష కారణంగా అన్నాహజారే 4.25 కేజీల బరువు తగ్గారని, బీపీ పెరిగిందని డాక్టర్ ధనంజయ్ పొటే తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా హజారే ప్రాణాలను కాపాడాలని శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే,, సామాజిక కార్యకర్త రాజేంద్ర సింగ్ సోమవారం హజారేను కలిశారు. ‘హజారే 2013లో చేసిన దీక్ష కారణంగానే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. హజారే వల్లే కేజ్రీవాల్ ఎవరో దేశానికి తెలిసింది. అలాంటి వ్యక్తి కనీసం ధర్నాకు మద్దతు తెలియజేయలేదు’ అని ఠాక్రే అన్నారు. -
దీక్ష విరమించిన హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్‌లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్‌పై రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్‌కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసుకెళ్లారు. -
వివాదాస్పద నిబంధనలు పునఃపరిశీలిస్తాం
లోక్‌పాల్‌పై ‘సుప్రీం’లో కేంద్రం అంగీకారం న్యూఢిల్లీ: వివాదాస్పదమైన లోక్‌పాల్ ఎంపిక నిబంధనలను పునఃసమీక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అంగీకరించింది. నిబంధనల్లో తుది సవరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదించింది. లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ నిబంధనలను సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం కింద రూపొందించిన సెర్చ్ కమిటీ నిబంధనలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని గత విచారణ (ఏప్రిల్ 1న)లో ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు నిబంధనలు 10(1), 10(4)లను పునఃసమీక్షించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ సోమవారం ధర్మాసనానికి నివేదించారు. ఆయన ప్రకటనను నమోదుచేసుకున్న ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
లోక్‌పాల్‌లో పీపీ రావు వద్దు
ప్రధాని ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ న్యూఢిల్లీ: లోక్‌పాల్‌లో ఐదో సభ్యుడిగా సీనియర్ న్యాయవాది పీపీ రావు పేరును ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దేశ ప్రజలు 40 ఏళ్ల నుంచి లోక్‌పాల్ కోసం ఎదురుచూస్తున్నారని, ఆ నియామకాలపై వారికి నమ్మకం కలిగించాలని చెప్పారు. సభ్యుల ఎంపిక ఏకగ్రీవమయ్యేందుకు రాష్ట్రపతి జోక్యాన్ని కోరతానని తెలిపారు. ఐదో సభ్యుడి ఎంపిక విషయంలో మరింత సమయం కావాలని, పలువురి అభ్యర్థనలను పరిశీలించాలని కోరారు. అనుకూలవర్గంతో లోక్‌పాల్‌ను నింపకూడదన్నారు. పరాశరన్‌ను నియమించండి... అయితే లోక్‌పాల్ ప్యానల్లోని ప్రఖ్యాత న్యాయకోవిదుడు విభాగపు నియామక అంశంపై ప్రధాని నివాసంలో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో కూడా ప్రధాని ప్రతిపాదనతో సుష్మ విభేదించారని సమాచారం. పీపీ రావు కాంగ్రెస్‌కు అనుకూలురని, ప్యానల్లో అలాంటి వారికి చోటు ఇవ్వవద్దంటూ వాదించారని తెలిసింది. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తుల్ని నియమించాలని డిమాండ్ చేశారని, పీపీ రావు స్థానంలో మాజీ అటార్నీ జనరల్ కె. పరాశరన్‌కు చోటివ్వాలని కోరారని సుష్మ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎంపిక కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులు ప్రధాని మన్మోహన్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు.. పీపీ రావుకు మద్దతు తెలిపినట్లు ఆ వర్గాలు చెప్పాయి. లోక్‌పాల్‌లోని ఎనిమిది మంది సభ్యులకు నామినేషన్ పక్రియ శుక్రవారంతో ముగుస్తుంది.