'కయ్యానికి కాలు దువ్వితే..చూస్తూ ఊరుకోం'
చంఢీఘడ్: భారత దేశ సహనాన్ని, ఓపికను బలహీనతగా చూడవద్దని పాకిస్థాన్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నింటితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలని భారత్ కోరుకుంటోందని ఆయన అన్నారు.
నియంత్రణారేఖ వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘటనకు పాల్పడుతున్న అంశాన్ని ఉద్దేశించి రాజ్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే..తాము తెల్ల జెండాను చూపబోమని ఆయన తెలిపారు. కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ తో శాంతి చర్చలు జరపమని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. కయ్యానికి కాలుదువ్వితే చూస్తూ ఊరుకోబోమని రాజనాథ్ తెలిపారు.