భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్ | 'India must act responsibly along the LoC' | Sakshi
Sakshi News home page

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

Published Thu, Oct 9 2014 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

భారత్ బాధ్యతాయుతంగా ఉండాలి:పాకిస్తాన్

ఇస్లామాబాద్: భారత్‌వైపు నుంచి జరిగే ఎలాంటి దురాక్రమణను అయినా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్‌కు ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ గురువారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణకు దారితీయకూడదని తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఖ్వాజా సూచించారు.

 

‘ఇలాగే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే.. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందన ఉంటుంద’న్న భారత రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యల అనంతరం ఖ్వాజా పై విధంగా స్పందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement