జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని సౌజైన్ సెక్టర్లోకి శుక్రవారం తెల్లవారుజామున పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగాయి. వరుసగా మూడో రోజు శుక్రవారం భారత సరిహద్దు బలగాలపై పాక్ కాల్పులు జరుపుతు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.