జమ్ము : పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్నితుంగలోకి తొక్కి కాల్పులకు దిగింది. జమ్మూకాశ్మీర్ ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో రెండు బీఎస్‌ఎఫ్ కేంద్రాలు లక్ష్యంగా.... పాక్ రేంజర్స్ శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన బీఎస్‌ఎఫ్ బలగాలు దాడిని తిప్పికొట్టాయి.
ఊహించని దాడితో సరిహద్దు గ్రామ ప్రజలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని బంకర్లలోకి పరుగులు తీశారు. భయంతో తెల్లారే వరకు అక్కడే ఉండిపోయారు. 12 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ దాదాపు 20 సార్లుకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది.
కాగా మేఘాలయాలో భారత సైన్యం, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. వారి స్థావరం నుంచి భారీగా మందు గుండు సామగ్రీని స్వాధీనం చేసుకున్నారు.