జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి బీఎస్ఎఫ్కు చెందిన 12 ఔట్ పోస్ట్లే లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని పోలీసులు వెల్లడించారు. వెంటనే భారత బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగాయని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరి కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ రోజు ఉదయం 6.05 గంటలకు పాక్ బలగాలు బీఎస్ఎప్ పోస్ట్లపై కాల్పులకు తెగబడ్డాయని వివరించారు. అలాగే సోమవారం సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గల నాలుగు ప్రాంతాలలో పాక్ ఆర్మీతో పాటు రేంజర్స్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ తెంపరితనాన్ని చాటుకున్నాయని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.