పాకిస్ధాన్ తీరు ఏమాత్రం మారడం లేదు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది.
జమ్మూకాశ్మీర్: పాకిస్ధాన్ తీరు ఏమాత్రం మారడం లేదు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్ జిల్లాలోని భారత్ పాక్ సరిహద్దు వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. స్వల్ప తీవ్రత గల మోర్టార్ షెల్లింగ్స్ వేశారు.
దీంతో అక్కడే ఉన్న భారత సైన్యం వారికి గట్టిగా బదులిచ్చింది. ఇరు వర్గాల మధ్య కొన్నిగంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభమైన నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడటం ఇది నాలుగోసారి.