యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్ Sudan declared a ceasefire details | Sakshi
Sakshi News home page

యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్

Published Mon, May 22 2023 10:12 PM

Sudan declared a ceasefire details - Sakshi

సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. 

ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి.

కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement