జెరూసలేం: అనూహ్యంగా కుదిరిన ఇజ్రాయె ల్–హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ 60 రోజులపాటు అమల్లో ఉంటుంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యం ఈ కాలంలో అక్కడి నుంచి వెనక్కి మళ్లుతుంది. ఆయా ప్రాంతాలను లెబనాన్ సైతం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది.
ఒప్పందం ప్రకారం.. ఆక్ర మణకాలంలో ఆయా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన హెజ్‌బొల్లా స్థావరా లను తిరిగి నిర్మించకూడదు. 14 నెలలకాలంగా సరిహద్దు వెంట యుద్ధం కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల స్థానికులు మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చి ధ్వంసమైన తమ ఇళ్లు, దుకాణాలను నిర్మించుకోవచ్చు.
‘‘ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీలతో మాట్లాడా. తా త్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండిపోవాలని ఆశిస్తున్నా’’ అని శ్వేతసౌధం నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యా నించారు. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు హెజ్ బొల్లా నుంచి లభిస్తున్న ఆయుధ, నైతిక మద్ద తును అడ్డుకునేందుకే ఇజ్రాయెల్ ఈ కా ల్పుల విరమణకు అంగీకారం తెలిపిందని అంతర్జాతీయ మీడియా లో వార్తలొచ్చాయి. అయితే హెజ్‌బొల్లాతో పోరులో నిండుకున్న ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకునేందుకు ఈ కాల్పుల విరమణ కాలాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment