పాక్ కాల్పులు: భారత జవాన్లు మృతి | J-K: Two jawans killed as Pakistan violates ceasefire ahead of Modis visit | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులు: భారత జవాన్లు మృతి

Published Tue, Nov 3 2015 10:03 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

J-K: Two jawans killed as Pakistan violates ceasefire ahead of Modis visit

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని గురెజ్ సెక్టార్లో భారత జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారని రక్షణశాఖ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. భారత జవాన్లు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగారని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటలకు ఈ కాల్పులు కొనసాగాయని చెప్పారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. ఇటీవల కాలంలో భారత సరిహద్దుల్లోని భారత జవాన్ల శిబిరాలే లక్ష్యంగా పాక్ సైన్యం తరచుగా కాల్పులు దిగింది. ఈ కాల్పుల్లో పలువురు భారతీయ జవాన్లతోపాటు పౌరులు మరణించారు. అలాగే పశువు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement