ఢిల్లీ: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ దుందుడుకు చర్యలపై గురువారం భారత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లు పాల్గొన్నారు. ఇప్పటికే భారత సరిహద్దు పరిస్థితులను బీఎస్ఎఫ్ డీజీ పాఠక్ కేంద్రానికి వివరించారు.
భారత సరిహద్దుల్లోని అకునూర్ ప్రాంతంపై బుధవారం పాక్ సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.