శ్రీనగర్: సరిహద్దులో తరచూ నియంత్రణ రేఖా(ఎల్వోసీ) ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరపుతున్న పాక్ రేంజర్ల దాడుల్లో శనివారం మరో బీఎస్ఎఫ్ జవాను నితిన్ సుభాష్(28) అమరుడయ్యారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన నితిన్ సుభాష్ 2008లో బీఎస్ఎఫ్ లో చేరారు.
సుభాష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, శుక్రవారం రాత్రి నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన మిలిటెంట్లు ఓ బీఎస్ఎఫ్ జవాను చంపి శరీరాన్ని ముక్కముక్కలుగా నరికిన విషయం తెలిసిందే.
మరో జవాను అమరుడయ్యారు
Published Sat, Oct 29 2016 11:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
Advertisement
Advertisement