ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ లవ్ గురూ!గా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహమాడవచ్చని సమాధానమిచ్చారు. న్యూఇయర్ సందర్భంగా మాట్లాడిన వీడియో సందేశంలో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ వ్యక్తి పాక్ ప్రధాని అన్వర్-ఉల్-హక్-కాకర్‌ను అడగగా.. 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానమిచ్చారు. డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏమి చేయాలి అనే మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ.. తన జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మందిని ఆకట్టుకున్నానని చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. 'అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.' అని కాకర్ స్పందించారు. సరైన అత్తగారు లేకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంక్షోభ నిర్వహణ కోర్సులో చేరాలని ఫన్నీగా చెప్పారు.
పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్‌ను ఎంపిక చేశారు. పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.
ఇదీ చదవండి: వన్ ఉమన్ షో!
Comments
Please login to add a commentAdd a comment