త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి | complete early pushkar works | Sakshi
Sakshi News home page

త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి

Published Sat, Aug 6 2016 11:37 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి - Sakshi

త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి

నాగార్జునసాగర్‌
పుష్కరాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సాగర్‌ పుష్కరఘాట్ల ఇన్‌చార్జి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి కోరారు. శనివారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయంలో కాంట్రాక్టర్లు,సంబంధిత ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కూలీల సంఖ్యను పెంచైనా అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ రమేశ్,ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
 ఎస్‌ఈ కార్యాలయంలో జయశంకర్‌ జయంతి
 ఎస్‌ఈ కార్యాలయంలో జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాజెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షుడు జానపాటిరాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement