pushkarworks
-
పుష్కరపనులు పరిశీలించిన జేసీ
బుగ్గమాధవరం(మేళ్లచెర్వు) మండలంలో కృష్ణాపుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన బగ్గుమాధవరం,వజినేపల్లి ,కిష్టాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన స్నానపు ఘాట్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదు పాయాలను పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను నేటితో పూర్తి చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 ఘాట్ల పరిధిలో 1400 మంది ప్రభుత్వ అధికారులు, 8000 మంది ప్రైవేట్ ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. వారికి 9,10 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి,ఆర్డీఓ నారాయణరెడ్డి,తహసీల్దార్ శ్రీదేవి,ఐబీ డీఈ స్వామి, ఎంపీడీఓ శాంతకుమారి పాల్గొన్నారు. -
త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి
నాగార్జునసాగర్ పుష్కరాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సాగర్ పుష్కరఘాట్ల ఇన్చార్జి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి కోరారు. శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో కాంట్రాక్టర్లు,సంబంధిత ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కూలీల సంఖ్యను పెంచైనా అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ రమేశ్,ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఎస్ఈ కార్యాలయంలో జయశంకర్ జయంతి ఎస్ఈ కార్యాలయంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాజెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు జానపాటిరాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.