ప్రజాసాధికార సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
Published Tue, Oct 18 2016 10:34 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
కాకినాడ సిటీ :
అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అలసత్వం ప్రదర్శించకుండా ప్రజా సాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునీట ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాయింట్ కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు. ఈనెల 26 తేదీలోపు సర్వే పూర్తి చేయాలన్నారు. సర్వే పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సబ్ కలెక్టర్‌లు, ఆర్‌డీఓలు క్షేత్రస్ధాయిలో పర్యవేక్షించి నిరే్ధశించిన గడువులోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లా నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 76.55 శాతం సర్వే పూర్తి చేశామని మిగిలినది గడువులోపు పూర్తి చేస్తామన్నారు. ట్యాబ్‌లు, డివైజెస్ సర్వే పూర్తయిన ప్రాంతాల నుంచి మిగిలిన ప్రాంతాలకు పంపించే చర్యలు తీసుకున్నామన్నారు. నిర్ణీత సమయానికి సర్వే పనులు పూర్తిచేసి, నివేదిక పంపడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ బాషా, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Advertisement