
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే వారం రోజుల ముందుగానే మే 25న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాలు చాలా ముందుగా దేశంలోని ప్రవేశిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే(మే 30న) దేశంలోకి ప్రవేశించాయి.
Comments
Please login to add a commentAdd a comment