
నలుగురు యువతులు తమ బాడీనే కాన్వాస్‌గా మలుచుకుని అద్భుతంగా వేసిన బాడీ పెయింటింగ్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
తమ శరీరాలనే కాన్వాస్‌గా చేసుకుని అద్భుతమై ఆకృతులను మన కళ్ల ముందు సాక్షాత్కరింప చేయడం ఒక కళ. బాడీ పెయింటింగ్ ప్రక్రియ అతి పురాతనమైన కళల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మానవ సంస్కృతిలో కీలకమైనగా భాగంగా ఉంది. యుద్ధం, వేడుకల్లాంటి వివిధ సందర్బాలతోపాటు, శతృవుల నుంచి కాపాడు కునేందుకు, వేటగాళ్ళు తమను తాము దాచి ఉంచుకోవడానికి ఈ బాడీ పెయింటింగ్ ఉపయోపడిందని భావిస్తారు. గతంలో ఇలాంటివి బాడీ పెయింటింగ్ చాలానే చూసాం.
తాజాగా అలాంటి బాడీ పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు యువతులు కలిసి బాడీలపై టైగర్ ను చిత్రీకరించిన వైనంగా విశేషంగా నిలిచింది. 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం గమనార్హం. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి మరి.
The best body art ever! pic.twitter.com/o951xUfKJh
— Figen (@TheFigen_) January 28, 2024