Canvas
-
24 అడుగుల భారీ కళాకృతి
సాంస్కృతిక ఐక్యత, సమాజ స్ఫూర్తి కలిగేలా విశాఖపట్నంకు చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ 24 అడుగుల పొడవైన యాక్రిలిక్ కాన్వాస్ పెయింటింగ్ వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ కళాకృతి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని 10 జిల్లాల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఏకీకరణకు దృశ్యంగా నిలిచింది.స్థానిక వారసత్వానికి జీవంస్పష్టమైన రంగులు, క్లిష్టమైన వివరాలతో ఆయా రాష్ట్రాల్లోని కమ్యూనిటీల స్థానిక వారసత్వం, సంప్రదాయాల సారాంశానికి జీవం పోశాడు. కాన్వాస్లోని ప్రతి భాగం ఈ ప్రాంతాలలోని ప్రముఖ ప్రదేశాలు, గిరిజన నృత్యాలు, పండగలు, చేతి పనులు, మార్కెట్లతో పాటు ఈ ప్రాంతాలకు విలక్షణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాలను, వాటితో అనుసంధానంగా ఉండే వ్యక్తుల జీవితాలను కళ్లకు కడుతుంది. ఇవే కాదు గనులు, చిత్రకూట్ జలపాతాలు, కోలాబ్ డ్యామ్, విజయనగరం కోట వంటి మూడు రాష్ట్రాల్లోని 53 ప్రసిద్ధ ప్రదేశాలను చూపుతుంది.సామాజిక జీవనానికి అంకితం‘ఈ ఆర్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంప్రదాయాలు, వాణిజ్యం ఒకచోట చేర్చే విలువలను పంచుకునే కమ్యూనిటీల సామరస్యపూర్వక సహజీవనానికి ఈ కళాకృతి అంకితం. ఈ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నప్పటికీ, నేను నా పని ద్వారా వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని ఆశించాను‘ అని విజయ్ కుమార్ తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ భారీ కళాకృతిని ప్రదర్శించడానికి ఆ శాఖ చొరవ తీసుకోవడం, వారి ప్రాంగణంలో స్థానిక కళ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నానాన్ని అంతా అభినందిస్తున్నారు.(చదవండి: రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!) -
అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే కాన్వాస్‌గా..వీడియో వైరల్!
తమ శరీరాలనే కాన్వాస్‌గా చేసుకుని అద్భుతమై ఆకృతులను మన కళ్ల ముందు సాక్షాత్కరింప చేయడం ఒక కళ. బాడీ పెయింటింగ్ ప్రక్రియ అతి పురాతనమైన కళల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మానవ సంస్కృతిలో కీలకమైనగా భాగంగా ఉంది. యుద్ధం, వేడుకల్లాంటి వివిధ సందర్బాలతోపాటు, శతృవుల నుంచి కాపాడు కునేందుకు, వేటగాళ్ళు తమను తాము దాచి ఉంచుకోవడానికి ఈ బాడీ పెయింటింగ్ ఉపయోపడిందని భావిస్తారు. గతంలో ఇలాంటివి బాడీ పెయింటింగ్ చాలానే చూసాం. తాజాగా అలాంటి బాడీ పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు యువతులు కలిసి బాడీలపై టైగర్ ను చిత్రీకరించిన వైనంగా విశేషంగా నిలిచింది. 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం గమనార్హం. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి మరి. The best body art ever! pic.twitter.com/o951xUfKJh — Figen (@TheFigen_) January 28, 2024 View this post on Instagram A post shared by Johannes Stoetter Art (@johannesstoetterart) -
చనిపోయిన బొద్దింకలపై అందమైన చిత్రాలు!!
Brenda Delgado uses dead bodies of cockroaches as her canvas: బొద్దింకలను చూస్తే ‘ఛీ యాక్’ అని చీదరించుకుని పారిపోయే వాళ్లే ఎక్కువ. అలాంటి బొద్దింకలపై అందమైన చిత్రాలను చిత్రించడం.. అదీ చచ్చిన తర్వాత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి చనిపోయిన బొద్దింకలపై ఫిలిప్పీన్స్‌కి చెందిన కళాకారిణి అందమైన దృశ్యాలను చిత్రించింది. అసలు విషయంలోకెళ్తే... మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో తన పని ప్రదేశంలో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. డెల్గాడో స్వతహాగా ఆర్టిస్ట్. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఉపయోగించి ఎందుకు చిత్రించకూడదు అని అనుకుంది. అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌ను ఉపయోగించి రకరకాల చిత్రాలను చిత్రించింది. పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని అందరికీ పిలుపు ఇస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమె కళను చూసి ఫిదా అవుతున్నారు. (చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్
న్యూఢిల్లీ: చిన్నారులు ముద్దులొలికే మాటలు, వారి హావాభావాలు చూస్తుంటే పెద్దలకు తమ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మంది పిల్లలు చిన్న వయసులో సహజ సిద్ధంగానే వాళ్లలో కొన్ని కళలు దాగి ఉంటాయి. పాట పాడటం, డ్యాన్స్ చేయడం లేదా మంచి జ్ఞాపకశక్తి తదితర టాలెంట్లను పిల్లలో చూసుంటాం. అయితే అతి చిన్న వయసులోనే కుంచె పట్టుకున్న అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీయగల పిల్లలను చూసి ఉండం కదా!. కానీ ఢిల్లీకి చెందిన మూడేళ్ల ఏళ్ల అర్మాన్ రహేజా సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి మరీ అందర్నీ ఆకర్షించేలా కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్‌లు వేసి అందరీ మన్నలను పొందుతున్నాడు. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము) అంతే కాదండోయ్ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత పిన్న వయసులో ఇండియా హాబిటాట సెంటర్లో సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన కళాకారుడుగా చరిత్రలో నిలవడమే కాక ప్రపంచంలోనే అత్యంత పిన్న కళాకారుల్లో ఒకడిగా కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆర్మాన్ తన చూట్టు ఉన్న పరిసరాలను నుండి స్ఫూర్తి పొందడమే కాక దానికి తన సృజనాత్మక శక్తిని జోడించి అక్రిలిక్, వాటర్ కలర్స్ పోస్టర్ రంగులను ఉపయోగించి కాన్వాస్‌పై రమణీయమైన చిత్రాలను గీస్తాడు. అర్మాన్ తల్లి కాశిష్ రహేజా ఎఫ్ఐడీఎంలో ఇంటిరియర్ డిజైనర్, తండ్రి నయన్ రహేజా న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్ట్. ఈ మేరకు అర్మాన్ తల్లి కాశిష్ మాట్లాడుతూ....గతేడాది రంగులతో ఆడుతుంటే అది తనలోని అసాధారణమైన ప్రతిభకు సంకేతంగా చెబుతున్నాడని అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల అసాధారణ ప్రతిభ గుర్తించిగలిగితేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి ప్రోత్సహించగలరు. ఈ విషయంలో స్కూల్ టీచర్ భావన, అమ్మమ్మ నిర్మల్ రహేజా కూడా అర్మాన్ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడట మేకాక తన ఆలోచనలకు ఒక నమూనాను రూపొందించగలిగేలా అర్మాన్ని మలిచారు. సూపర్నోవా, జెల్లీ ఫిష్ వంటి టైటిల్స్‌తో అర్మాన్ ప్రతి కాన్వాసులను ఎంత అద్భుతంగా గీస్తాడో కూడా వివరించారు. పైగా తమ కుమారుడి పనికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) -
పదిహేను సర్జరీలు అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు..
ప్రతి విజయం వెనుక కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు నిరంతర సాధనతో సమస్యలను అధిగమించి విజయ తీరాలకు చేరతారు. కానీ వైకల్యంతో ఉన్నతస్థాయికి ఎదగాలంటే మాత్రం... ‘కష్టాల కడలి’ని ఈదాల్సిందే. ఇటువంటి కష్టాల కడలిని ఎంతో ధైర్యంగా ఈది సమాజంలో తనకంటూ గుర్తింపును ఏర్పర్చుకున్నారు ‘ఇయర్‌బుక్ కాన్వాస్’ సహవ్యవస్థాపక సీఈవో సురాశ్రీ రహానే. వైకల్యాన్ని ఓడించి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ప్రేరణగా నిలసున్నారు సురాశ్రీ. నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో సురాశ్రీ రహానే జన్మించింది. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో సురాశ్రీ పదిహేను రోజుల శిశువుగా ఉన్నప్పుడే కాళ్లకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అంతటితో సమస్య తీరుతుంది అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అది ప్రారంభం మాత్రమే అని తర్వాత తెలిసింది వారికి. ఒకపక్క తనసమస్యతో బాధపడుతూనే సురాశ్రీ స్కూలుకెళ్లి చక్కగా చదువుకునేది. ఒకసారి మేజర్ సర్జరీ అయింది. అప్పుడు కొన్ని నెలల పాటు స్కూలుకు వెళ్లడం కుదరలేదు. దీంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నందుకు తనకు ఎంతో బాధపడేది. ఇప్పటిదాక మొత్తం పదిహేను సర్జరీలు అయినప్పటికి సురాశ్రీ∙వైకల్యానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు! ఇలా ఉంటే నేను ముందుకు వెళ్లలేను బాగా చదువుకోని ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ సురాశ్రీ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ‘‘చిన్నప్పుడు నాకాళ్ల మీద నేను నిలబడేందుకు కాళ్లు సహకరించలేదు! అయినా ఎంతో కష్టపడి నడవడం నేర్చుకున్నాను! ఇప్పుడు కెరియర్లో కూడా నాకు నేనే ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. జ్ఞాపకాల ఐడియా.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న కష్టాలు, వైకల్యంతో కోల్పోయిన కార్యక్రమాలు, ఆనందకరమైన సందర్భాలు, స్నేహితులతో సరిగ్గా గడపలేని క్షణాలు తనకి గుర్తుకొచ్చాయి. ‘‘ఇటువంటి మధుర, చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఒక దగ్గర రాసుకుని ఏడాది తరువాత చూసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది’ అన్న సురాశ్రీ ఆలోచనకు ప్రతిరూపమే ‘ఇయర్‌బుక్ కాన్వాస్’. స్టార్టప్ మార్వారీ కెటలిస్ట్ ఇన్వెస్ట్ చేయడంతో ఇయర్‌బుక్ కాన్వాస్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇయర్‌బుక్ కాన్వాస్‌కు మంచి గుర్తింపు రావడంతో ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ ఆసియా పసిఫిక్ యూనివర్సిటి నుంచి ‘అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా’ అవార్డులు సురాశ్రీని వరించాయి. టెడెక్స్, యూనెస్కో, యుపెన్ వంటి అంతర్జాతీయ వేదికలపై మోటివేషనల్ స్పీకర్‌గాకూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను ఎప్పుడూ జ్ఞాపకాలు రాసుకోవడానికి బుక్ కొనుక్కోలేదు. నాకు ఎవ్వరూ సలహా కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను బుక్ కొనకపోవడం వల్లే ఈరోజు ఇయర్ బుక్‌ను తీసుకు రాగలిగాను. భారతదేశంలో నంబర్ వ¯Œ ఇయర్ బుక్ కంపెనీగానేగాక, ఆసియాలో మొబైల్ అప్లికేషన్ కలిగిన ఏకైక బుక్ కంపెనీ గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ‘కార్పొరేట్ మెమరీ బుక్’ను తీసుకొచ్చాం. గతకాలపు జ్ఞాపకాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇయర్‌బుక్, కార్పొరేట్ మెమరీ బుక్‌లు తీసుకొచ్చాము. త్వరలోనే వైకల్యం గలిగిన పిల్లల కోసం ‘ఫ్యూచర్ ఎంట్రప్రెన్యూర్ బుక్’ తీసుకొస్తున్నాం’’అని సురాశ్రీ చెప్పింది. -
చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి. కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్‌ని ఆమె తన కాన్వాస్‌కు వాడుకుంది. స్లమ్స్ కలర్‌ఫుల్ దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్‌తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి. కళతో కనెక్ట్ కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్‌తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్‌షాప్‌లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు. కొత్త శక్తి దిశగా! రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి. రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్‌ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్‌లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి. మహిళలతో రూబుల్ నాగి -
బిగ్ బ్యాటరీతో మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్
మైక్రోమ్యాక్స్ తన కాన్వాస్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాన్వాస్ 2 ప్లస్(2018) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర 8,999 రూపాయలు. 5.7 అంగుళాల స్క్రీన్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్ ఫోన్లు ఆఫర్ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ టాప్ ఫీచర్ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ. దీని బ్యాటరీ లైఫ్ 15 నుంచి 20 గంటలు. 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రూపొందింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీనిలో ఉన్నాయి. పలుచైన బడ్జెట్ ఫోన్లలలో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 8ఎంఎం థిక్‌నెస్‌ను కలిగి ఉందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది. జెట్ బ్లాక్ ఫిన్నిష్‌తో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. తొలుత కాన్వాస్ రేంజ్లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసినప్పుడు తమ తొలి స్మార్ట్‌ఫోన్ కాన్వాస్ 2 అని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ చెప్పారు. ఇన్ఫినిటీ స్క్రీన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, అతిపెద్ద బ్యాటరీతో ప్రస్తుతం కాన్వాస్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఒకానొక సమయంలో భారత్‌లో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారిగా మైక్రోమ్యాక్స్ ఉండగా.. కానీ గత రెండేళ్ల నుంచి కంపెనీ తన స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్‌ను చైనీస్ కంపెనీలు నడిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ లీడర్‌గా షావోమి ఉంది. మైక్రోమ్యాక్స్ తాజాగా లాంచ్ చేసిన కాన్వాస్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్‌గా అందుబాటులో ఉండనుంది. -
కువకువల సంధ్యారాగం
ఎర్రటి సూరీడు నల్లటి మబ్బుల మాటుకు జారుకుంటున్న వేళ..నీలాకాశం కాషాయం కాటుక దిద్దుకుని మెరిసిపోతుంటే.. పగలంతా అలసిసొలసిన గువ్వలు ఆ ప్రకృతి కాన్వాస్‌పై ఒక్క చోట చేరి ఆత్మీయ సరాగాలు ఆలపిస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం. ఈ మనోహర దృశ్యం ప్రత్తిపాడు సమీపంలోని పాత మద్రాసు రోడ్డు వెంబడి శుక్రవారం కనువిందు చేసింది. –ప్రత్తిపాడు -
సృజనకు స'వాల్'
అందంగా అలంకరణ చేసుకునే వీలుండగా, బోసి పోయినట్టుగా ఉండాల్సిన పనేంటి? ఖాళీ కాన్వాస్‌గా ఉండే బదులు రకరకాల బొమ్మలతో నింపేస్తే సరి! ఇంతకీ అంత ఖాళీగా ఉండే కాన్వాస్ ఏంటంటే.. అవి మాఇంటిగోడలు అంటున్నారు సిటీజనులు. కంప్యూటర్ టేబుల్, స్విచ్ బోర్డ్, బెడ్‌ల్యాంప్ ఉన్న మూల, బెడ్ ఆనుకుని ఉన్న గోడ ఇలా ఇంట్లో ఏ చోటుని అయినా చక్కటి కాన్వాస్‌గా మార్చి కొత్త లుక్ ఇచ్చేస్తున్నారు. పక్షులు, చెట్లు, నక్షత్రాలు, సీతాకోక చిలుకలు, గార్డెన్ టు గ్యాలెక్సీని తెచ్చి ఇంటి గోడగా మార్చేస్తున్నారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి ఇంటి గోడలు ఇంటికి రక్షణగానే కాదు.. అభిరుచికి అద్దంగా కూడా నిలుస్తున్నాయి. నగరంలోని నివాసాలు చాలా వరకు అపార్ట్మెంట్లు.. అందులో వార్డ్రోబ్లు, ఫర్నీచర్ పోనూ ఒక ఖాళీ గోడను అలాగే అట్టి పెట్టుకుంటున్నారు. దాన్ని వాల్ హ్యాంగిగ్స్, పెయింటింగ్స్‌తో అలంకరిస్తున్నారు. మొత్తం మీద తమ అలంకరణాభిలాషను అలా తీర్చుకుంటున్నారు. అయితే గోడలను మరింత అందంగా అలంకరించుకోవచ్చునని అంటున్నారు అభిరుచి కలవారు. థీమ్ డెకర్... నచ్చిన థీమ్‌లను ఇంటి గోడలపై చిత్రించుకోవచ్చు. ‘వాల్ డెకల్/వాల్స్టిక్కర్’ పేరుతో పాపులర్ అయిన ఈ ఇంటీరియర్ డిజైన్లు సిటీలో ఇప్పుడు బాగా పాపులర్. వీటిని ఎలా తయారు చేసుకోవాలి? వేసుకోవాలి? అనే వీడియోలు యూట్యూబ్‌లో ఎన్నో లభిస్తాయి. ఒకవేళ ఇంటి యజమాని ఆర్టిస్ట్ అయితే తనే చక్కని చిత్రాన్ని వేసుకోవచ్చు. అలా వేసుకోలేని వారికి ఆన్లైన్ సర్వీస్‌లు, స్టిక్కర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సర్వీసులు నేరుగా మన సిటీలో దొరుకుతున్నాయి. అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవడం లేదా చేయించుకోవడం ఏదైనా సులువే. అయితే ఖాళీ గోడలను అందంగా చూసుకోవాలనే ఆసక్తి ఉంటే స్వయంగా ఈ స్టిక్కర్స్ తయారు చేసుకోవచ్చు. వ్యయప్రయాసలకు ఓర్చుకునే సత్తాను బట్టి వాల్స్‌ని క్రియేటివ్‌గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. అలంకరణకు సూచనలు... గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లపై అవగాహన ఉంటే స్వతహాగా డిజైన్లు తయారు చేసుకోవచ్చు. వినైల్ పేపర్ మీద ప్రింట్ తీసి, కత్తిరించి, జాగ్రత్తగా గోడలకు అతికించాలి. మార్కెట్లో వాల్ స్టిక్కర్స్ లభ్యమవుతున్నాయి. వీటి ధర రూ.300 నుంచి ఉంటుంది. -
అమ్మాయికి కోక్ బాటిల్ల్లాంటి నడుముంటే..
లండన్: సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా తమ అందాన్ని ప్రేమిస్తుంటారు. చూసేవారిని ఆకర్షించేందుకు కొత్తగా కనిపించాలనుకుంటారు. వారి ఆలోచనలు ఆసరాగా చేసుకుని వెలిసినవే నేటి బ్యూటీ పార్లర్లు.. ప్రత్యేక ఫిట్ నెస్ సెంటర్లు.. మసాజ్ సెంటర్లు. సహజంగా వీటిని ఆశ్రయించి వారు తమను కోరుకున్న విధంగా మార్చుకుంటుంటారు. కొంతమంది వాటికి వెళ్లినా కూడా ఎలాంటి మార్పు కనిపించదు. పైగా వింత వింత కోరికలు కూడా ఉంటుంటాయి. జుట్టు బాగుండాలని, నడుంబాగుండాలని, ఐబ్రోస్ అదిరిపోవాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఈ కోరికలకు ఏ అమ్మాయి మినహాయింపుకాదు. లండన్‌కు చెందిన జోడీ స్టీల్ అనే ఆర్టిస్ట్ కూడా అదే కోవకు చెందింది. ఆమెకు తన నడుం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎంతో సన్నటి నడుం తనకు ఉండాలని కోరుకునేది. ఓ సీసా మూతలాంటి నడుం తనకు ఎందుకు ఉండకూడదని అనుకుంది. కానీ జీవితాంతం ప్రయత్నించినా అది సాధ్యం కాదు కాబట్టి ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొత్తగా ఆలోచించింది. స్వతహాగా ఆమె ఆర్టిస్టు కావడంతో వెనుకబాగం అంతా నల్లటి రంగుతో ఉన్న క్లాత్ ను అమర్చి తన తెల్లటి నడుంపై రంగులు వేయడం ప్రారంభించింది. తన పొట్టబాగాన్నే బొమ్మలు గీసే కాగితంగా మార్చుకొని కోక్ సీసా లాంటి రూపంలో చిత్రాన్ని గీసి ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. నిజానికి ఇది చూసిన వాళ్లంతా ఆమె నడుం ఇంత సన్నగా అచ్చం సీసీ మూతలాగా ఎలా మారిందబ్బా అని ఆశ్చర్యపోక మానదు. తమ అందాన్ని గురించి ఒత్తిడికి లోనయ్యేవారు ఎలా బయటపడొచ్చో చెప్పేందుకే ఆమె ఈ పనిచేసినట్లు తెలిపింది. -
మనుషులనే కాన్వాస్‌గా..
బ్రిస్టల్: నెమలి బొమ్మ బాగుందా ? కాకపోతే ఇది కాన్వాస్‌పై వేసింది కాదు. మనుషులనే కాన్వాస్‌గా చేసుకుని అద్భుతంగా వేసిన బాడీ పెయింటింగ్ ఇది. బ్రిస్టల్‌కు చెందిన కేట్ డీన్ అనే యువతి కొంతమంది మోడల్స్ శరీరంపై రంగులు వేయడం ద్వారా ఈ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చదిద్దింది. -
కాన్వాస్‌పై బసవన్న
అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అని తన యజమాని చెప్పగానే తలాడిస్తూ బసవన్న చేసే విన్యాసాలు ఆ పల్లెటూరి చిన్నోడి కళ్లలో స్థిరపడిపోయాయి. గంగిరెద్దు గజ్జెల సవ్వడి, అలంకరణ, ఊరంతా దానికి కప్పిన రంగురంగుల పంచెలు.. ఆ పిల్లాడికి ముచ్చటగొలిపింది. అప్పుడు మనసులో తిష్టవేసిన బసవడి రూపం చేయి తిరిగిన కళాకారుడిగా మారిన తర్వాత కాన్వాస్‌పై కదంతొక్కింది. హిందూ సంప్రదాయంలో భాగంగా ఉన్న గంగిరెద్దు విన్యాసాలు ఈ ముస్లిం చిత్రకారుడి కుంచెలో ప్రాణం పోసుకుంటున్నాయి. ఆర్ట్‌కు మతాలతో సంబంధం లేదని నిరూపిస్తున్న మహమ్మద్ ఉస్మాన్‌ను సిటీప్లస్ పలకరించింది.. ..:: వాంకె శ్రీనివాస్ మాది మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట. హిందువుల పండుగ సంబురాల్లో ముస్లింలు పాల్గొనేవారు. రంజాన్ వేడుకల్లో హిందువులూ పాలుపంచుకునేవారు. అలా హిందువుల పండుగలను దగ్గరగా చూసే అవకాశం దొరికింది. మా నాన్న మహమ్మద్ ఇషాక్ మంచి పెయింటర్ కావాలనుకున్నాడు. ఆర్థిక సమస్యలతో తన లక్ష్యాన్ని వదిలేసి అటవీశాఖలో ఉద్యోగిగా చేరి సరిపుచ్చుకున్నాడు. ఫోకస్ పల్లెటూరే.. నేనూ చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడిని. నా ఆసక్తి గమనించిన నాన్న నన్ను జేఎన్టీయూలో బీఎఫ్ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఎంట్రెన్స్ కోసం సిటీకి తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఊళ్లోనే కమర్షియల్ ఆర్టిస్ట్‌గా జీవనం సాగించాను. పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక నా లక్ష్యం వెతుక్కుంటూ కుటుంబంతో 1998లో హైదరాబాద్ వచ్చేశా. అదే ఏడాది జేఎన్టీయూలో బీఎఫ్‌ఏలో చేరాను. నాలోని కళకు మెరుగులు దిద్దుకుని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా మారాను. మొదట్లో పల్లెటూరి అందాలను ఫోకస్ చేస్తూ పెయింటింగ్ చేసేవాన్ని. మూపుర ప్రాభవం.. నాలుగేళ్ల కిందట సంక్రాంతికి మా ఊరెళ్లాను. గంగిరెద్దులను చూడగానే నా బాల్యం గుర్తుకు వచ్చింది. గంగిరెద్దులను ఆడించేవాళ్లు వాటిని భలేగా అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకూ వాటి ఆహార్యం ఎంతో హుందాగా ఉంటుంది. రంగురంగుల కొమ్ములు, వాటి చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలు, నొసట అందమైన తోలు కచ్చడాలు.. మూపురంపై రంగు పంచె, దానిపై ఓ పూలదండ.. ఈ అలంకరణతో గంగిరెద్దు నందీశ్వరుడికి ప్రతిరూపంలా కనిపిస్తుంది. అయితే కాలక్రమంలో గంగిరెద్దుల సందడి కాస్త తగ్గింది. ఆనాటి ప్రాభవం ఇప్పుడు పల్లెల్లోనూ కనిపించడం లేదు. వాటి ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు బసవన్నల థీమ్‌తో పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను. నాలుగేళ్లుగా ఈ పెయింటింగ్స్‌తో దిల్లీ, బెంగళూరు, ముంబైలలో ప్రదర్శనలు నిర్వహించాను. గతేడాది నవంబర్‌లో సింగపూర్‌లోనూ ఆర్ట్ ఫెయిర్ నిర్వహించాను. అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంతో సంబంధం.. కళాకారుడికి సంబంధం ఉండాల్సింది మతంతో కాదు సమాజంతో. మన చుట్టూ ఉన్నవాటిల్లో నుంచే సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. గంగిరెద్దు థీమ్ కూడా ఇలా ఎంచుకున్నదే. గవ్వలు, మువ్వలు.. వివిధ అలంకరణ సామగ్రిని కాన్వాస్‌పై చిత్రించేందుకు ఎంతో ఓపిక కావాలి. ఒక బొమ్మ వేయడానికి 15 రోజులకు పైగా పడుతుంది. పెయింటింగ్స్ బాగున్నాయన్న ప్రశంసలే నా కష్టాన్ని మరచిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం మీర్‌పేట సమీపంలోని అల్మాస్గూలో నేనుంటున్న ఇంట్లోనే స్టూడియో నిర్వహిస్తున్నాను. నా పెయింటింగ్స్ రూ.18 వేల నుంచి రూ.2.40 లక్షల వరకూ పలుకుతున్నాయి. నా ఇద్దరు బిడ్డలు సహన తన్వీర్, సమీన తన్వీర్లను ఆర్టిస్టులుగా చూడాలని ఉంది. -
ప్రేమకు రూపం
రాధాకృష్ణులు... శివపార్వతుల అనురాగ బంధాన్ని కుంచెతో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు కళాకారుడు రాజేశ్వర్ న్యాలపల్లి. ఆయున వేసిన పెరుుంటింగ్స్తో బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ఫార్మ్స్ ఆఫ్ లవ్’ చక్కని దృశ్య కావ్యంగా నిలిచింది. వచ్చే నెల4 వరకు ప్రదర్శన ఉంటుంది.