సాంస్కృతిక ఐక్యత, సమాజ స్ఫూర్తి కలిగేలా విశాఖపట్నంకు చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ 24 అడుగుల పొడవైన యాక్రిలిక్ కాన్వాస్ పెయింటింగ్ వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ కళాకృతి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని 10 జిల్లాల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఏకీకరణకు దృశ్యంగా నిలిచింది.
స్థానిక వారసత్వానికి జీవం
స్పష్టమైన రంగులు, క్లిష్టమైన వివరాలతో ఆయా రాష్ట్రాల్లోని కమ్యూనిటీల స్థానిక వారసత్వం, సంప్రదాయాల సారాంశానికి జీవం పోశాడు. కాన్వాస్‌లోని ప్రతి భాగం ఈ ప్రాంతాలలోని ప్రముఖ ప్రదేశాలు, గిరిజన నృత్యాలు, పండగలు, చేతి పనులు, మార్కెట్‌లతో పాటు ఈ ప్రాంతాలకు విలక్షణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాలను, వాటితో అనుసంధానంగా ఉండే వ్యక్తుల జీవితాలను కళ్లకు కడుతుంది. ఇవే కాదు గనులు, చిత్రకూట్ జలపాతాలు, కోలాబ్ డ్యామ్, విజయనగరం కోట వంటి మూడు రాష్ట్రాల్లోని 53 ప్రసిద్ధ ప్రదేశాలను చూపుతుంది.
సామాజిక జీవనానికి అంకితం
‘ఈ ఆర్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంప్రదాయాలు, వాణిజ్యం ఒకచోట చేర్చే విలువలను పంచుకునే కమ్యూనిటీల సామరస్యపూర్వక సహజీవనానికి ఈ కళాకృతి అంకితం.
ఈ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నప్పటికీ, నేను నా పని ద్వారా వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని ఆశించాను‘ అని విజయ్ కుమార్ తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ భారీ కళాకృతిని ప్రదర్శించడానికి ఆ శాఖ చొరవ తీసుకోవడం, వారి ప్రాంగణంలో స్థానిక కళ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నానాన్ని అంతా అభినందిస్తున్నారు.
(చదవండి: రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!)
Comments
Please login to add a commentAdd a comment