
ఎర్రటి సూరీడు నల్లటి మబ్బుల మాటుకు జారుకుంటున్న వేళ..నీలాకాశం కాషాయం కాటుక దిద్దుకుని మెరిసిపోతుంటే.. పగలంతా అలసిసొలసిన గువ్వలు ఆ ప్రకృతి కాన్వాస్‌పై ఒక్క చోట చేరి ఆత్మీయ సరాగాలు ఆలపిస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం. ఈ మనోహర దృశ్యం ప్రత్తిపాడు సమీపంలోని పాత మద్రాసు రోడ్డు వెంబడి శుక్రవారం కనువిందు చేసింది. –ప్రత్తిపాడు





