అమ్మాయికి కోక్ బాటిల్ల్లాంటి నడుముంటే.. | This artist turned her body into a canvas to make a beautiful statement about beauty standards | Sakshi
Sakshi News home page

అమ్మాయికి కోక్ బాటిల్ల్లాంటి నడుముంటే..

Published Fri, Mar 11 2016 9:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

అమ్మాయికి కోక్ బాటిల్ల్లాంటి నడుముంటే.. - Sakshi

అమ్మాయికి కోక్ బాటిల్ల్లాంటి నడుముంటే..

లండన్: సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా తమ అందాన్ని ప్రేమిస్తుంటారు. చూసేవారిని ఆకర్షించేందుకు కొత్తగా కనిపించాలనుకుంటారు. వారి ఆలోచనలు ఆసరాగా చేసుకుని వెలిసినవే నేటి బ్యూటీ పార్లర్లు.. ప్రత్యేక ఫిట్ నెస్ సెంటర్లు.. మసాజ్ సెంటర్లు. సహజంగా వీటిని ఆశ్రయించి వారు తమను కోరుకున్న విధంగా మార్చుకుంటుంటారు.

కొంతమంది వాటికి వెళ్లినా కూడా ఎలాంటి మార్పు కనిపించదు. పైగా వింత వింత కోరికలు కూడా ఉంటుంటాయి. జుట్టు బాగుండాలని, నడుంబాగుండాలని, ఐబ్రోస్ అదిరిపోవాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఈ కోరికలకు ఏ అమ్మాయి మినహాయింపుకాదు. లండన్కు చెందిన జోడీ స్టీల్ అనే ఆర్టిస్ట్ కూడా అదే కోవకు చెందింది. ఆమెకు తన నడుం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎంతో సన్నటి నడుం తనకు ఉండాలని కోరుకునేది. ఓ సీసా మూతలాంటి నడుం తనకు ఎందుకు ఉండకూడదని అనుకుంది.

కానీ జీవితాంతం ప్రయత్నించినా అది సాధ్యం కాదు కాబట్టి ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొత్తగా ఆలోచించింది. స్వతహాగా ఆమె ఆర్టిస్టు కావడంతో వెనుకబాగం అంతా నల్లటి రంగుతో ఉన్న క్లాత్ ను అమర్చి తన తెల్లటి నడుంపై రంగులు వేయడం ప్రారంభించింది.

తన పొట్టబాగాన్నే బొమ్మలు గీసే కాగితంగా మార్చుకొని కోక్ సీసా లాంటి రూపంలో చిత్రాన్ని గీసి ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. నిజానికి ఇది చూసిన వాళ్లంతా ఆమె నడుం ఇంత సన్నగా అచ్చం సీసీ మూతలాగా ఎలా మారిందబ్బా అని ఆశ్చర్యపోక మానదు. తమ అందాన్ని గురించి ఒత్తిడికి లోనయ్యేవారు ఎలా బయటపడొచ్చో చెప్పేందుకే ఆమె ఈ పనిచేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement