ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొదట ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై క్షిపణులతో బాంబు దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ యోధులను భూ ఉపరితలంపై ఓడించింది. కాగా ఇజ్రాయెల్‌కు చెందిన ప్రత్యేక దళం కిబ్బట్జ్ నగరాన్ని హమాస్ యోధుల చెర నుండి విడిపించింది. ఈ దళంలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉండటం విశేషం. వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబరు 7న హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు వారు ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం ఈ నగరాన్ని విడిపించే బాధ్యతను లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందానికి అప్పగించింది. ఈ టీమ్‌లో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ 13 మంది కిబ్బట్జ్ నగరంలోకి ప్రవేశించి, హమాస్ యోధులను ఓడించారు.
హమాస్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ తన మొత్తం సైన్యాన్ని భూ ఉపరితలంపైకి దింపింది. ఈ సైన్యంలో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు పావువంతు మంది మహిళలే. గ్రౌండ్ జీరో వద్ద కూడా మహిళా సైనికులు హమాస్ యోధులతో భీకరంగా పోరాడుతున్నారు. అయితే లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందం కొన్ని గంటల్లో వంద మంది హమాస్ యోధులను హతమార్చింది. ఈ నేపధ్యంలో ఈ ఫోర్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పాటు, ఈ మహిళా యోధులను ఇజ్రాయెల్ సింహాలుగా పిలుస్తున్నారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్- హమాస్ మధ్య 19 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 7,044 మంది మరణించారు. వీరిలో 1400 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వారు కాగా, 6546 మంది గాజా స్ట్రిప్‌కు చెందిన వారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 756 మంది మృతి చెందారు.
ఇది కూడా చదవండి: చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్‌లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
Comments
Please login to add a commentAdd a comment