
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించటంతో త్వరలో ఆంధ్ర ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలపై చర్చ మొదలైంది. పలువురు ప్రముఖులు తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ నేపథ‍్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు.
‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారు టీఆర్‌ఎస్ పార్టీ సౌండ్ మాత్రమే విన్నారు.. 2019లో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే జనరల్ ఎలక్షన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినిపించబోయే రీ సౌండ్ వినబోతున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం వినపడే రీ సౌండ్ వినబోతున్నారు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పారు.