తమిళ సినిమా రీమేక్లో కలర్స్ బ్యూటీ.? | Colours Swathi in Aandavan Kattalai remake | Sakshi
Sakshi News home page

తమిళ సినిమా రీమేక్లో కలర్స్ బ్యూటీ.?

Published Tue, Mar 7 2017 3:02 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

తమిళ సినిమా రీమేక్లో కలర్స్ బ్యూటీ.?

తమిళ సినిమా రీమేక్లో కలర్స్ బ్యూటీ.?

యాంకర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్గా మారిన తెలుగమ్మాయి స్వాతి. కలర్స్ ప్రోగ్రామ్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ., హీరోయిన్గా మారిన తరువాత కూడా కలర్స్ స్వాతిగానే ప్రాచుర్యం పొందింది. హీరోయిన్గా స్వామిరారా, కార్తీకేయ, గోల్కొండ హై స్కూల్ లాంటి సక్సెస్లు సాధించిన ఈ భామ తరువాత ఆ హవా కొనసాగించలేకపోయింది. టాలీవుడ్లో వరుస ఫ్లాప్లు పలకరించటంతో కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది.

కోలీవుడ్లో కూడా పరిస్థితి మారలేదు. అక్కడ కూడా వరుస ఫ్లాప్లు స్వాతి కెరీర్ ను డైలామాలో పడేశాయి. దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న స్వాతి ఇప్పుడు ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన అందవన్ కట్టాలయ్ తెలుగు రీమేక్లో స్వాతి హీరోయిన్గా నటిస్తోంది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ఫేం చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రక్షక్ అనే కొత్త  కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement