
తిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు సినీ ప్రముఖులు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంచు కుటుంబంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత, హీరోయిన్ కీర్తి సురేశ్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు. మంచు మోహన్‌బాబు, తన భార్యతో పాటు కుమారుడు విష్ణు, కోడలు, మనమరాళ్లతో వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. అంతకుముందు నైవేద్య విరామ సమయంలో నటి కీర్తి సురేశ్ వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని వచ్చారు. వారికి ఆలయ అధికారులు మర్యాదాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం కీర్తి సురేశ్ తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది.
మోహన్‌బాబు దర్శనాంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాదిలాంటి పరిస్థితులు రావొద్దని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తాను సన్నాఫ్ ఇండియా సినిమా చేస్తున్నట్లు, ఫిబ్రవరిలో విడుదలవుతుందని మోహన్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment