చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా చంద్రగిరి మండలం రంగంపేట శ్రీ విద్యానికేతన్ కళాశాల ఆవరణలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన నారాయణస్వామి నాయుడు చివరి వరకూ విద్యానికేతన్‌లో ఉపాధ్యాయులుగా కొనసాగారు. 96వ ఏట ఆయన మృతి చెందారు. విలువలతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని తపన పడిన వ్యక్తి తన తండ్రి అని ఆయన గుర్తుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. అలాగే తన తండ్రి పేరిట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోహన్ బాబు నెలకొల్పారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుని ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
నటుడు మోహన్ బాబు తండ్రి విగ్రహావిష్కరణ
Published Fri, Sep 5 2014 10:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement