statue unveiled
-
ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో శనివారం ఆవిష్కరించారు. ఆ దేశ రాజధాని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె వాణీదేవి, ఎన్ఆర్ఐ ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల, అక్కడి నగర మేయర్ మాథ్యూ బ్లాక్మెర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, హార్న్ కౌన్సిలర్ శ్రీని పిల్లమర్రితో కలిసి ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో మహాత్మాగాంధీ విగ్రహం తరువాత ప్రతిష్ఠించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీదే కావడం గమనార్హం. భారతదేశ పాలనావ్యవస్థలో అనేక మార్పులు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యుదయానికి పీవీ పాటుపడ్డారని పలువురు వక్తలు కొనియాడారు. పీవీ సంస్కరణల ఫలితాలను, ప్రయోజనాలను ప్రస్తుతం భారత్ ప్రజలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ హేమచందర్‌రావు కల్వకోట, సుజాత కల్వకోట, భారతి, విజయ హాజరయ్యారు. ఇదీ చదవండి: యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్ -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్‌రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు
-
‘కొమ్ములు తిరిగిన నటుడైనా సరే.. ఆయన దగ్గరకు రావాల్సిందే’
సాక్షి, పశ్చిమగోదావరి : తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ మా నాన్న ఒక బడిపంతులు. విలన్‌గా ఉన్న నన్ను కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. హీరోగా తయారు చేసింది మా గురువు గారే. అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించే గొప్ప అవకాశాన్ని కల్పించారు. నేను నిర్మించిన శ్రీ విద్యానికేతన్‌లో దాసరి పేరుతో ఆడిటోరియం, లైబ్రరీని నిర్మించాను’ అని మోహన్‌బాబు దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు. కొమ్ములు తిరిగిన నటుడైనా సరే దాసరిని వేషం ఇమ్మని అడిగారే తప్ప ఆయన ఏనాడు ఏ నటుడిని ఫలానా వేషం వేయాలని అడగలేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ కొనియాడారు. కాగా దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు సహా సినీ ప్రముఖులు రాజా వన్నెంరెడ్డి, కోటి, రవిరాజా పినిశెట్టి, ఎన్.శంకర్, సురేష్ కొండేటి, అంబికా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సావిత్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
గుంటూరు: నగరంలోని నాజ్ సెంటర్లో మహానటి సావిత్రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, డిప్యూటీ స్పీకర్‌మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు నాయకులతో పాటు ప్రముఖ సినీనటి సుహాసిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహానటి అని పలువులు కొనియాడారు. -
స్థూపం ఆవిష్కరించిన చాడ వెంకట్ రెడ్డి
సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి గ్రామంలో ఏఐటీయూసీ జిల్లా సెక్రటరీ అడ్డగుట్ట మల్లయ్య స్మారకార్థం స్థూపాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చాడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలు నిరోధించడంలో విఫలమయిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనం దిశగా పయనిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు ఎన్డీఏ అడుగులు వేస్తుందని దుయ్యబట్టారు. 'హిందువులు పిల్లల్ని ఎక్కువ మందిని కనాలని చంద్రబాబు అనడం' సమంజసంగా లేదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. -
నటుడు మోహన్ బాబు తండ్రి విగ్రహావిష్కరణ
చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా చంద్రగిరి మండలం రంగంపేట శ్రీ విద్యానికేతన్ కళాశాల ఆవరణలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన నారాయణస్వామి నాయుడు చివరి వరకూ విద్యానికేతన్‌లో ఉపాధ్యాయులుగా కొనసాగారు. 96వ ఏట ఆయన మృతి చెందారు. విలువలతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని తపన పడిన వ్యక్తి తన తండ్రి అని ఆయన గుర్తుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. అలాగే తన తండ్రి పేరిట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోహన్ బాబు నెలకొల్పారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుని ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. -
ముంబైలో రాజేశ్ ఖన్నా విగ్రహం ఆవిష్కరణ
బాలీవుడ్ చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా వెలుగులు విరజిమ్మిన సుపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా ధైర్యానికి ప్రతీక అని ఆయన మాజీ భార్య డింపుల్ కపాడియా పేర్కొన్నారు. ఆయన ఆనంద్ చిత్రంలో నటించడమే కాకుండా ఆనంద్‌లా జీవించారని తెలిపారు. మరణం సమీపించిన తరుణంలో కూడా రాజేశ్ ఖన్నా తన ముఖాన చిరునవ్వు చెక్కుచెదరలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజేశ్ ఖన్నా విగ్రహాన్ని ముంబై నగరంలోని బాంద్రా విధిలో శనివారం ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, కూతుళ్లు ట్వింకిల్ ఖన్న అల్లుడు అక్షయ్ కుమార్‌లు హాజరయ్యారు. చేతిలో బెలూన్లు పట్టుకున్నట్లు ఉన్న రాజేష్ ఖన్న విగ్రహాం చూస్తేంటే ఆనందంగా ఉందని అక్షయకుమార్ తెలిపారు. రాజేష్ ఖన్నా (కాకాజీ)కి ఆ అరుదైన గౌరవం లభించినందుకు ట్వింకిల్ ఖన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్ ఖన్నా తనుకు మంచి స్నేహితుడని అందాల నటి హేమమాలిని తెలిపారు. అలాగే ఆయనతోకలసి నటించడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. రాజేశ్ ఖన్నాతో కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఆశా ఫరేఖ్, మిధున్ చక్రవర్తి రాకేష్ రోషన్, ఫరాహ్ అక్తర్, జితేంద్ర, జోయ అఖ్తర్, రణదీర్ కపూర్, రిషి కపూర్, జాకీ షరాఫ్, హేమమాలి తదితరులతోపాటు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.