స్థూపం ఆవిష్కరించిన చాడ వెంకట్ రెడ్డి | statue unveiled by chada venkatreddy | Sakshi
Sakshi News home page

స్థూపం ఆవిష్కరించిన చాడ వెంకట్ రెడ్డి

Published Fri, Jan 23 2015 5:34 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి గ్రామంలో ఏఐటీయూసీ జిల్లా సెక్రటరీ అడ్డగుట్ట మల్లయ్య స్మారకార్థం స్థూపాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

సుల్తానాబాద్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి గ్రామంలో ఏఐటీయూసీ జిల్లా సెక్రటరీ అడ్డగుట్ట మల్లయ్య స్మారకార్థం స్థూపాన్ని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చాడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలు నిరోధించడంలో విఫలమయిందన్నారు.

 

ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనం దిశగా పయనిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు ఎన్డీఏ అడుగులు వేస్తుందని దుయ్యబట్టారు. 'హిందువులు పిల్లల్ని ఎక్కువ మందిని కనాలని చంద్రబాబు అనడం' సమంజసంగా లేదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement