ఆదర్శప్రాయుడు బర్ధన్
సంతాపసభలో సీపీఐ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ ప్రతి కమ్యూనిస్టుకు ఆదర్శప్రాయుడని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కొనియాడారు. ఆదివారం మగ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బర్ధన్ సంతాపసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ అగ్ర నాయకుడు ఏబీ బర్ధన్ మరణంతో పార్టీ ఓ గొప్పనేతను కోల్పోయిందన్నారు. అన్ని వర్గాల సమస్యలపై ప్రతి పోరాటంలో క్రియాశీల పాత్ర పోషిం చిన బర్ధన్ మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ బర్ధన్ ఆశయాలను ముం దుకు తీసుకెళ్లడానికి ప్రతి కమ్యూనిస్టు కంకణబద్ధుడు కావాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, రాం నర్సింహారావు, ప్రభాకర్, బోస్, బాలమల్లేష్, సుధాకర్, పి. ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం సంతాపం
కమ్యూనిస్టు అగ్రనేత బర్ధన్ మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. బర్ధన్ కార్మికోద్యమంలో, లెఫ్ట్ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు ఉత్తమ కమ్యూనిస్టుగా కొనసాగారని ఆపా ర్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, తెలంగాణ సాయు ద పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. వెంకటేశ్ తదితరులు సంతాపం తెలిపారు.