Sree vidyanikethan
-
తిరుపతిలో మోహన్ బాబు ధర్నా
-
చంద్రబాబు నీకు అంత పొగరా?, అహంకారామా?
-
నా పార్టీ అంటావేంటి బాబు: మోహన్‌బాబు
సాక్షి, తిరుపతి : కాలం ఎల్లవేళలా మనది కాదని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి రావల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆయన శుక్రవారం తిరుపతిలో విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ...‘చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం చేశారు. అందర్నీ మోసం చేశారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు ఇంకా యువతకు ఏమి ఉద్యోగాలు ఇస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే మహానుభావుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. ఆ ముఖ్యమంత్రులు ఆ పథకాలు ప్రారంభిస్తే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పు అప్రిషియేట్ చేస్తా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటు వేస్తే నీచంగా మోసం చేశావు. చదవండి....(తిరుపతిలో రోడ్డుపై మోహన్ బాబు ధర్నా) మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేశారు. అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నేతలు ఆ పార్టీలో ఉన్నారు. నా పార్టీ నా పార్టీ అంటావేంటి చంద్రబాబు...అది ఎన్టీఆర్ పార్టీ. సరే నీ కర్మ, దానితో నాకు సంబంధం లేదు. ప్రజలే బుద్ధి చెబుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?. పగలు, రాత్రిలా ....అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తుందో... అలాగే చంద్రబాబు కాలం ఎల్లవేళలా మనది కాదు అది గుర్తు పెట్టుకో. అన్ని కోట్లు సంపాదించిన నువ్వు రేపు ఏమవుతావో?. మనిషే శాశ్వతం కాదు...ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలి. ఆయన చెప్పే హామీలన్నీ అసత్యాలు. అబద్దాలకోరు, అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం చెబుతారు. ఇన్నాళ్లకు ఆయనకు పసుపు-కుంకుమ గుర్తుకు వచ్చిందా?’ అని ప్రశ్నలు సంధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు అపద్ధాలకోరు..
-
ఫీజులే చెల్లించని బాబు..జాబు లేదు..గీబు లేదు
-
ఎల్లవేళలా నీదికాదు చంద్రబాబు: మోహన్ బాబు
-
తిరుపతిలో రోడ్డుపై మోహన్ బాబు ధర్నా
సాక్షి, తిరుపతి : సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ శుక్రవారం తిరుపతిలో ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఆయన శ్రీవిద్యా నికేతన్ సంస్థల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చదవండి....(చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టుకో: మోహన్ బాబు) ఈ నిరసనను అణిచి వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ...మోహన్ బాబును గృహ నిర్భందం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోను తన నిరసన కొనసాగిస్తానంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంచారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి శ్రీవిద్యా నికేతన్‌కు సుమారు రూ.17కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాలి. ఎన్నోసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టా’. అని తెలిపారు. చదవండి...(ఆస్తులు తాకట్టుపెట్టి కాలేజీని నడపాల్సి వస్తుంది!) కాగా చంద్రబాబు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పదివేల మంది విద్యార్థులతో తిరుపతి లీలామహల్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వరకూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే తిరుపతి రూరల్ రంగంపేటలోని విద్యానికేతన్ విద్యాసంస్థల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మోహన్ బాబు ధర్నాతో తిరుపతి-పీలేరు రహదారిలో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. Wanted to take a peaceful rally today in Tirupathi protesting the non payment of the fee reimbursement of the students by the Govt.... Police have arrived at our home in Tirupathi and looks like they are not going to allow the rally. — Mohan Babu M (@themohanbabu) 22 March 2019 Why is The government not paying the students fee? And the rally I want to is for the students. I don’t gain anything from it. 19 crores have been pending and for what? Why isn’t the government honoring their commitment???? — Mohan Babu M (@themohanbabu) 22 March 2019 -
శ్రీ విద్యానికేతన్ వద్ద ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు
-
నటుడు మోహన్ బాబు తండ్రి విగ్రహావిష్కరణ
చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా చంద్రగిరి మండలం రంగంపేట శ్రీ విద్యానికేతన్ కళాశాల ఆవరణలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన నారాయణస్వామి నాయుడు చివరి వరకూ విద్యానికేతన్‌లో ఉపాధ్యాయులుగా కొనసాగారు. 96వ ఏట ఆయన మృతి చెందారు. విలువలతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని తపన పడిన వ్యక్తి తన తండ్రి అని ఆయన గుర్తుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. అలాగే తన తండ్రి పేరిట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోహన్ బాబు నెలకొల్పారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుని ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.