మూడు సినిమాల్లో విలన్‌గా చేస్తున్న హీరో! | Aditya Om Doing Negative Shaded Roles In 3 Movies | Sakshi
Sakshi News home page

Aditya Om: మూడు సినిమాల్లో విలన్‌గా చేస్తున్న హీరో!

Published Thu, Dec 9 2021 5:07 PM | Last Updated on Thu, Dec 9 2021 5:07 PM

Aditya Om Doing Negative Shaded Roles In 3 Movies - Sakshi

తెలుగు హిట్‌ సినిమా 'లాహిరి.. లాహిరి.. లాహిరిలో' మూవీలో లీడ్ రోల్ పోషించిన నటుల్లో ఒకరైన ఆదిత్య ఓం.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు...

Aditya Om Turn As Villain: హీరో, విలన్, కమెడియన్ ఇలా రకరకాల వేరియన్స్‌ చూపించే అతి కొద్దిమంది నటుల్లో ఆదిత్య ఓం ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు హిందీ సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న ఆదిత్య బాలీవుడ్‌లో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు విలన్‌గా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు ఆదిత్య ఓం.

తెలుగు హిట్‌ సినిమా 'లాహిరి.. లాహిరి.. లాహిరిలో' మూవీలో లీడ్ రోల్ పోషించిన నటుల్లో ఒకరైన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ గడప తొక్కారు. అలా బీ టౌన్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లోనూ రాణిస్తున్నారు. నటుడిగా అన్నిరకాల పాత్రలకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయిన ఆదిత్య ఓం.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు.

కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న నాగ వర్మతో కలిసి 'విక్రమ్' అనే సినిమాలో మాఫియా బాస్‌గా నటిస్తున్నారు ఆదిత్య ఓం. దీంతో పాటు మరో రెండు సినిమాలు ''అమరం (నగరంలో), పవిత్ర'' మూవీల్లో విభిన్నమైన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అమరం సినిమాలో ఆది సాయి కుమార్‌తో కలిసి నటిస్తున్న ఆదిత్య.. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన హ్యాకర్ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే జ్యోతి, గాయత్రి గుప్తాతో కలిసి పవిత్ర అనే వెబ్ ఫిల్మ్‌లో సైకోటిక్ డాక్టర్ వేషం వేస్తున్నారు. ఈ సినిమాలన్నీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో తన నెగెటివ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో చూపించానని చెప్పిన ఆదిత్య ఓం.. నేటితరం ప్రేక్షకులు సైతం నటులు తమ పరిమితులను అధిగమించాలని కోరుకుంటున్నారని, ప్రస్తుతం తాను అదే బాటలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement