'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో కెరీర్ ఆరంభించాడు ఆదిత్య ఓమ్. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆదిత్యకు అదృష్టం కలిసొచ్చింది అనుకున్నారంతా. తర్వాత అతడు ధనలక్ష్మి ఐ లవ్ యూ, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు? ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి చిత్రాలు చేశాడు. కానీ మళ్లీ లాహిరి లాహిరి లాహిరిలో వంటి ఘన విజయం మాత్రం రాలేదు. దీంతో తనే దర్శకుడిగా మారి మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ సినిమా తెరకెక్కించాడు. తర్వాత తనే దర్శక,నటుడిగా బందూక్ చేశాడు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
'నటుడికి వయసుతో, పాజిటివ్, నెగెటివ్ రోల్‌తో సంబంధం ఉండదు. అందుకే నేను పాతికేళ్ల అబ్బాయిగానూ, 90 ఏళ్ల ముసలివాడిగానూ నటించగలను. 24 ఏళ్ల వయసులో కెరీర్ మొదలై 30 ఏళ్లకే ముగిసింది. ఆ వయసులో అందరికీ కెరీర్ మొదలవుతే నాకేమో ముగిసిపోయింది. ఆ సమయంలో నేను ముంబైలో ఉన్నాను. డిప్రెషన్‌తో ఇంట్లోనే ఉండిపోయాను. ఓవర్‌థింకింగ్ చేశాను. జీవితం ఏంటి ఇలా అయిపోయింది? ఇలా ఆగిపోయాను అని కుమిలిపోయాను. రెండేళ్లపాటు నాకు బ్యాడ్‌టైమ్ నడిచింది. తర్వాత సెల్ఫ్ మోటివేషన్‌తో ముందుకు వెళ్లాను. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కూడా ముఖ్యమే! టాలెంట్‌తో పాటు లక్ ఉంటేనే పీక్స్ వెళ్తారు' అని చెప్పుకొచ్చాడు ఆదిత్య ఓం.
Comments
Please login to add a commentAdd a comment