
నటుడు ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు.
2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి తనలోని మరో టాలెంట్ బయటపెట్టారు.ఇటీవలె ఉత్తమ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నారు. తాజాగా ఆయన నటించిన దహనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దిత్య ఓం మాట్లాడుతూ.. 'దహనం సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్. ప్రతీ శుక్రవారం సినిమాలు వస్తాయి. కానీ దహనం లాంటి సినిమాను ఏ ఐదేళ్లకో, పదేళ్లకో వస్తాయి. ఈ సినిమాను ఇంత గొప్పగా తీసిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు. ప్యాషన్‌తో తీసిన ప్రాజెక్ట్' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment