Actor Aditya Om Emotional Words At Pavithra Short Film - Sakshi
Sakshi News home page

Aditya Om: నా దగ్గర డబ్బుల్లేని సమయంలో ఆయనే నీడనిచ్చారు

Published Thu, Jul 14 2022 3:41 PM | Last Updated on Thu, Jul 14 2022 3:58 PM

Actor Aditya Om About Pavithra Short Film - Sakshi

యాక్టర్‌గా వెండితెరపై సత్తా చాటిన యువ హీరో ఆదిత్య ఓం డైరెక్టర్ గా కూడా సత్తా చాటారు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. తాజాగా ఆయన మొట్టమొదటిసారిగా పవిత్ర అనే షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆదిత్య స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ప్రీమియర్స్ ప్రదర్శించగా.. షార్ట్ ఫిలింను వీక్షించిన పలువురు ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, తెలుగు వన్ ఎండీ రవిశంకర్, గజల్ శ్రీనివాస్, అదిరే అభి, జాకీర్ హుస్సేన్, గాయత్రీ గుప్తా, హరిచందన్, రవికిరణ్, శ్రీరాపాక, వైభవ్ సూర్య, జ్యోతి లాభాల, నిర్మాత రఘు, మిస్ ఇండియన్ పసిఫిక్ రష్మీ ఠాకూర్ వంటి వారు పాల్గొన్నారు.

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ జనరల్ సెక్రటరీ టీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘ఓ డాక్టర్ చిన్న తప్పు చేస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో చూపించారు. నాకు తెలిసిన ఓ వ్యక్తికి కూడా అలానే జరిగింది. క్యాన్సర్ లేకపోయినా ఉందని చెప్పారు.. దాంతో ఆయన చనిపోయేంత వరకు వెళ్లారు. చివరకు క్యాన్సర్ లేదని తెలిసింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లంను ఇందులో చూపించారు. జాతీయస్థాయిలో కచ్చితంగా అవార్డులు వస్తాయి’ అన్నారు.

ఆదిత్య మాట్లాడుతూ.. ‘నేను అభిని 'ఒట్టూ.. ఈ అమ్మాయి ఎవరో తెలీదు' సినిమా సమయంలో కలిశాను. ఆనాడే చెప్పాను.. అతనొక పెద్ద స్టార్ అవుతాడు అని. ఈ రోజు ఇక్కడ ఉన్న వారిలో ఆయనే పెద్ద స్టార్. ప్రసన్న గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వైవీఎస్ చౌదరి గారు నాకు బ్రేక్ ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో సమస్యలు వస్తే ప్రసన్న గారు సాయం చేశారు. 2016లో ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా తీశాను. అప్పుడు కూడా ఆయన వచ్చి కో ఆపరేట్ చేశారు. మా ఎండీ రవి గారు మా అందరికీ పయోనీర్ లాంటి వారు. ఎంతో మంది యంగ్ టాలెంట్‌కు సపోర్ట్ చేస్తున్నారు. బంధీ సినిమాను చేశాం. డీఓపీ మధుసూదన్ గారిని అనుకోకుండా కలిశాను. సినిమాలు,యాడ్ ఫిల్మ్స్ కలిసి చేశాం. మా అన్నలాంటివారు.. ఆయన నాకు కంటిచూపు వంటివారు. రైటర్ హరిచందన్ గారితో ఓ వెబ్ సిరిస్ ప్లాన్ చేశాను. గజల్ గారిని చంబల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలిశాను. ప్రకాష్ నా సినిమాలకు ఎడిటర్‌. ఆయన వల్లే ఎంతో మంది హిందీలో దర్శకులయ్యారు. 2006లో నా పరిస్థితి బాగా లేనప్పుడు జాకీర్ ఇంట్లోనే ఉన్నాను.. నా దగ్గర డబ్బుల్లేని సమయంలో నీడనిచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహ్మద్ నా దగ్గర డ్రైవర్‌‌గా వచ్చాడు.. ఇప్పుడు దాదాపుగా 20 చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. మీ అందరూ షార్ట్ ఫిల్మ్‌ని చూసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 అదిరే అభి మాట్లాడుతూ.. ‘ఆదిత్య గారితో నాది 20 ఏళ్ల బంధం. ఓ సినిమాలో ఫ్రెండ్ కారెక్టర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బంధం కొనసాగుతోంది. నేను ఓ సారి ముంబైకి వెళ్తే వాళ్లింట్లోనే ఉన్నాను. అది ఎప్పటికీ మరిచిపోలేను. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఆదిత్యను చూసి తెలుగువాడని అనుకున్నారు. కానీ ముంబై నుంచి వచ్చి నటించాడని తరువాత తెలిసింది. అలాంటి నటుడి గురించి తెలుగు నిర్మాతలు ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాలేదు. మాస్ సాబ్ అనే సినిమాకు దర్శకుడిగా అవార్డులు వచ్చాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది హాలీవుడ్ రేంజ్ సినిమాతో పోటీ పడింది. ఆయన లాంటి టాలెంట్ ఉన్నవాళ్లని తెలుగు నిర్మాతలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పవిత్ర షార్ట్ ఫిల్మ్‌లో ఆదిత్య షారుఖ్ ఖాన్‌లా అనిపించారు. ఆయన టాలెంట్‌ను అందరూ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.

చదవండి: లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్‌ ‍హీరో పెళ్లి..!
ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement