విల్లాలో ఏం జరిగింది? | damini villa movie is horrer movie | Sakshi
Sakshi News home page

విల్లాలో ఏం జరిగింది?

Published Sun, Jun 24 2018 12:35 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

damini villa movie is horrer movie - Sakshi

ఆదిత్యా ఓం, రేఖ

శ్రీ తిరుమల మూవీ మేకర్స్‌పై రాకేష్‌ రెడ్డి దర్శకత్వంలో  పోలా రావు దండెం, ప్రతాప్‌ దండెం నిర్మిస్తోన్న హారర్‌ చిత్రం ‘దామిని విల్లా’ ఆదిత్యా ఓం, రేఖా బోజ్‌ జంటగా  నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘హారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది.

ఇంతవరకు సిల్వర్‌  స్క్రీన్‌ పై రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దామిని విల్లాలో ఏం జరిగింది? అనేదే చిత్రం.  నిర్మాతలు ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమాని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్‌ కుమార్‌ పరిసర్ల;  కెమెరా: శ్రీనివాస్‌ సబ్బి, ఎడిటింగ్‌: ఎమ్‌కేయస్‌ మనోజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ యాదవ్, నిర్మాతలు:   పోలా రావు దండెం, ప్రతాప్‌ దండెం, రచన–దర్శకత్వం: రాకేష్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement