Bandi Trailer : నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరో | Aditya Om's Experimental Movie 'Bandi' Trailer Unveiled | Sakshi
Sakshi News home page

Bandi Trailer : నగ్నంగా కనిపించి షాకిచ్చిన హీరో

Published Sat, Dec 23 2023 5:44 PM | Last Updated on Sat, Dec 23 2023 5:52 PM

Aditya Om Experimental Movie Bandi Trailer Unveiled - Sakshi

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సింగిల్ కారెక్టర్‌తో ‘బంధీ’అనే సినిమా చేస్తున్నాడు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా బంధీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాడు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించాడు.

ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించి అందరికి షాకిచ్చాడు.  దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఇక ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement