"లాహిరి లాహిరి లాహిరిలో" చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేసిన హీరో ఆదిత్య ఓమ్. విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "బందీ". ఈ చిత్రం ఫస్ట్‌లుక్ సోమవారం విడుదలైంది. ఇందులో హీరో అడవిలో 'బందీ 'అయినట్లు కనిపిస్తోంది. అతని ఛాతీపై తొండ పాకుతుండగా పక్కనే విషసర్పం బుసలు కొడుతోంది. దీన్ని చూసిన అభిమానులు ఒళ్లు జలదరిస్తోందని, ఇలాంటి పాత్ర చేసేందుకు పూనుకోవడం అంటే సాధారణ విషయం కాదని ప్రశంసిస్తున్నారు. (టైమ్ ఫిక్స్)
ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా అడవిలోనే జరుగుతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి బలమైన సందేశాన్ని ఇస్తుందని హీరో ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. టీ రాఘవ దర్శకత్వం వహిస్తున్న 'బందీ' సినిమాను రాకేశ్ గోవర్ధనగిరి, మధు సూదన్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. (‘ఇస్మార్ట్’ విజయం మా ఆకలిని తీర్చింది)
Comments
Please login to add a commentAdd a comment